Breaking News

Loading..

సిపిఎం ఆధ్వర్యంలో టివిఆర్ చంద్రం గారి 19వ వర్ధంతి సభ


బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 7 భద్రాచలం

ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని నిర్మించడమే కామ్రేడ్ టివిఆర్ చంద్రం కు మనమిచ్చే ఘన నివాళి అని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పిలుపునిచ్చారు. అమర జీవి కామ్రేడ్ టి. వి. ఆర్ చంద్రం గారి 19వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ టి వి ఆర్ చంద్రం గారి స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి ఎగరవేయగా, చంద్రం గారి చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో నాయకులు మాట్లాడుతూ భద్రాచలం ఉమ్మడి డివిజన్ మార్క్సిస్టు పార్టీ నిర్మాణంలో టివిఆర్ చంద్రం క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. కూనవరం కేంద్రంగా మొట్టమొదటి సిపిఎం శాఖ ఏర్పాటు చేసి ఆ శాఖకు కార్యదర్శిగా టి వి ఆర్ చంద్రం వ్యవహరించారని గుర్తు చేశారు. నాడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన సమయంలో టి వి ఆర్ చంద్రం రహస్య జీవితం గడుపుతూ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. భద్రాచలం ఏజెన్సీలో ఎర్ర జెండాకు వన్నెతెచ్చిన నేత టివిఆర్ చంద్రం అని అన్నారు. గిరిజన, గిరిజనేతర పేదల సమస్యలపై,వ్యవసాయ కార్మికులు, రైతాంగం,సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించారని అన్నారు. కామ్రేడ్ టీవీ ఆర్ చంద్రం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా పార్టీని బలోపేతం చేయడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు నకిరికంటి నాగరాజు, సండ్ర భూపేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు బిబిజి తిలక్, ఎంవీఎస్ నారాయణ, మురళీకృష్ణ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments